News April 10, 2025

వరంగల్: 6 వేల ఉద్యోగాలు.. దాదాపు 50 కంపెనీలు!

image

వరంగల్ మహా నగరంలో మంత్రి కొండా సురేఖ చొరవతో శుక్రవారం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని MK నాయుడు కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో సుమారు 6 వేల ఉద్యోగాల భర్తీకి 50కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 19, 2025

షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. మరిపెడ పట్టణంలోని మోడల్ స్కూల్ ను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం, హాస్టల్ గదులు, తరగతి గదులను, స్టాఫ్ రూం లను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. విద్యార్థుల్లోని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు.

News September 19, 2025

వరంగల్: మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాదం!

image

మద్యం తాగి డ్రైవ్ చేయవద్దని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన అవగాహన పోస్టర్‌లో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, అమాయకుల ప్రాణాలకు ప్రమాదం వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది మద్యం తాగి వాహనం నడపడం వల్ల అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.