News April 10, 2025
వరంగల్: 6 వేల ఉద్యోగాలు.. దాదాపు 50 కంపెనీలు!

వరంగల్ మహా నగరంలో మంత్రి కొండా సురేఖ చొరవతో శుక్రవారం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని MK నాయుడు కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో సుమారు 6 వేల ఉద్యోగాల భర్తీకి 50కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 13, 2026
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5min ఆలస్యమైనా అనుమతి

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఉ.9.35 వరకూ స్టూడెంట్స్‌ను ఎగ్జామ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనుండగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.
News March 13, 2026
గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు: కలెక్టర్ అంకిత్

భద్రాద్రి జిల్లాలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గురువారం ఐడీఓసీలో పౌరసరఫరాలు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
News March 13, 2026
నేటి నుంచి మరోసారి థియేటర్లలో ‘ధురంధర్’

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ధురంధర్’ ఇవాళ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా వెయ్యికి పైగా స్క్రీన్లలో 1250కి పైగా షోలు వేయనున్నట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ప్రకటించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై రూ.1350కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘ధురంధర్-2’ ఈ నెల 19న తెలుగులోనూ విడుదల కానుంది.


