News April 10, 2025

పోలీసుల అదుపులో ఐటీడీపీ కార్యకర్త కిరణ్ 

image

YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కిరణ్‌ను అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News January 14, 2026

పామిడిలో పండగపూట విషాదం

image

పామిడిలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీకి చెందిన కువకుడు ద్వారక గజిని పట్టణ శివారులోని 44 హైవేపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 14, 2026

భువనగిరి: పండగకు వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

image

సంక్రాంతికి సొంతూరుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన హయత్‌నగర్ PS పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు గౌడ్ వివరాల ప్రకారం.. మునగనూరులో నివాసముంటున్న గంజి అశోక్ తన సొంత ఊరు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కు బైక్‌పై వెళ్తుండగా పెద్ద అంబర్‌పేట్ సీతారాంపురం కమాన్ వద్ద మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 14, 2026

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదా?

image

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదు. సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే ఓ దివ్య నక్షత్రాన్ని మకర జ్యోతి అంటారని, ఇది ప్రకృతి సిద్ధమైనదని శబరిమల ప్రధానార్చకులు తెలిపారు. అదే సమయంలో పొన్నంబళమేడు కొండపై మూడు సార్లు ఓ హారతి వెలుగుతుంది. ఈ దీపారాధనను స్థానిక గిరిజనులు చేస్తారని దేవాలయ సిబ్బంది చెబుతోంది. ఈ హారతినే మకర విళక్కుగా భావిస్తారు. ఇది మానవ నిర్మితమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.