News April 10, 2025
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News April 18, 2026
మొగల్తూరు: వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

మొగల్తూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని గుబ్బల మావుళ్లు గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఆమెను నిత్యం వెంబడిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి, ఈనెల 14న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మొగల్తూరు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News April 18, 2026
కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.
News April 18, 2026
శ్రీ సత్యసాయి: కుక్క రూపంలో మృత్యువు!

లేపాక్షి KGBV ఆంగ్ల టీచర్ సుబాన్ బీ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భర్తతో బైకుపై వెళ్తుండగా చోళసముద్రం టోల్‌గేట్ వద్ద కుక్క అడ్డురావడంతో కిందపడ్డారు. తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స కోసం హిందూపురం, అక్కడి నుంచి అనంతపురం తరలిస్తుండగా మరణించారు. సమయానికి ముఖహాజరు వేయాలనే ఆత్రుతతో వెళ్తున్న ఆమెను కుక్క రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది. కుటుంబీకులు, విద్యార్థులు శోకసంద్రంలో మునిగారు.


