News April 10, 2025
ఏప్రిల్ 22న టెన్త్ ఫలితాలు?

ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదంటే రెండ్రోజులు అటూ ఇటుగా ఫలితాలు ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటితో మూల్యాంకనం పూర్తికాగా, ఫలితాలను కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. bse.ap.gov.in, Way2Newsలో ఫలితాలను తెలుసుకోవచ్చు.
Similar News
News October 18, 2025
ప్రశాంతమైన నిద్ర కోసం టిప్స్

*రాత్రిపూట మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందనేది అపోహే. మొదట్లో మత్తుగా ఉన్నా, ఆ తర్వాత నిద్రకు ఆటంకం కలుగుతుంది.
*రాత్రి పడుకోవడానికి గంట ముందు పాలు తాగాలి. అవకాడో, అరటి తినాలి.
*వెలుతురు లేని గదిలో పడుకోవాలి. బెడ్ లైట్ లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
>నిద్ర సరిగా లేకుంటే దీర్ఘకాలంలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
News October 18, 2025
5 జిల్లాల్లో ₹7910 కోట్లతో చురుగ్గా జలజీవన్ పనులు

AP: 5 జిల్లాల్లో ₹7910 కోట్లతో జలజీవన్ పథకం పనుల్ని ప్రభుత్వం చురుగ్గా సాగిస్తోంది. ఈ పథకం నిధులు మురిగిపోయే పరిస్థితి రాగా మరో 4 ఏళ్లు పొడిగించేలా కూటమి సర్కారు కేంద్రాన్ని ఒప్పించి మళ్లీ పనులకు శ్రీకారం చుట్టించింది. ఇవి పూర్తయితే 1.22 కోట్ల మందికి రక్షిత నీరందుతుంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న పశ్చిమ ప్రకాశంలో ₹1290కోట్లతో పనులు చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కొన్ని పూర్తయ్యాయి.
News October 18, 2025
న్యాయవ్యవస్థలు దిగొస్తాయని నమ్ముతున్నాం: ఆర్.కృష్ణయ్య

TG: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైందని బీసీ జేఏసీ ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయమని భావించి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయవ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని పేర్కొన్నారు. బీసీ కులాల గౌరవం, పేదరిక నిర్మూలన కోసం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు.