News April 10, 2025
HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.
Similar News
News January 9, 2026
రూ.425 కోట్లతో పెనుకొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

పెనుకొండలోని ఘనగిరి లక్ష్మీనరసింహ స్వామి కొండపై ₹425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 60 ఎకరాల్లో నిర్మించే ఈ కేంద్రంతో 4,035 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పెనుకొండకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News January 9, 2026
‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్సుల్లో రూ.132, ఇక 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్సుల్లో రూ.89 పెంచుకోవచ్చని పేర్కొంది. లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని సూచించింది.
News January 9, 2026
ఖమ్మం: సంక్రాంతి వేళ తస్మాత్ జాగ్రత్త: సీపీ

సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. నగలు బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కువ రోజులు తాళం వేసి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.


