News April 10, 2025

కొండగట్టు ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు

image

ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఉత్సవ కమిటీ ఇవాళ ఏర్పాటైంది. ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎండోమెంట్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఉత్సవ కమిటీ సభ్యులు కొండగట్టు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదం అందజేశారు.

Similar News

News September 19, 2025

పట్టాభిరాముని ఆలయాభివృద్ధికి చర్యలు: TTD

image

అన్న‌మ‌య్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి ఆల‌యాభివృద్ధికి TTD చర్యలు చేపట్టింది. ఆలయ పుష్క‌రిణి, క‌ళ్యాణ వేదిక మండ‌పం, రాజ‌గోపురం, ఆర్చి, క‌ళ్యాణ మండ‌పం త‌దిత‌ర ప‌నుల‌కు రూ.5.73 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా త‌రిగొండ‌లోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి పుష్క‌రిణి పునఃనిర్మాణానికి రూ.1.50 కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది.

News September 19, 2025

కోకా‌పేట్‌లో భర్తను చంపిన భార్య

image

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.

News September 19, 2025

బాపట్ల: రాజస్థాన్‌లో మన జవాన్ మృతి

image

బాపట్ల(M) వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన జవాన్ మేడిబోయిన దుర్గారెడ్డి రాజస్థాన్‌లో మృతి చెందినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి మృతదేహం అంబులెన్స్‌లో శనివారం స్వగ్రామానికి రానుందని చెప్పారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.