News April 10, 2025

పాలమూరు: 4 రోజులు.. ప్రకృతి అందాలు చూసొద్దాం..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి సళేశ్వరం లింగమయ్య జాతరను ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జాతరకు ముందే లక్షలాది మంది ప్రజలు తరలివెళ్తున్నారు. కాగా నాలుగు రోజులు సా.6గంటల వరకే అనుమతి ఉంటుందని, ఈ టైమింగ్స్‌ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి సహకరించాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ గుడిని ఏటా ఒకసారి మాత్రమే చూసేందుకు అవకాశం లభించడంతో ప్రజలు పోటెత్తారు.  

Similar News

News November 14, 2025

BRSకు స్వల్ప ఆధిక్యం

image

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది.

News November 14, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా<<>> బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై, NISM/NCFM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers

News November 14, 2025

వేములవాడ రాజన్న దర్శనాలు.. UPDATE

image

వేములవాడ రాజన్న ఆలయంలో రెండు రోజుల క్రితం నుంచి దర్శనాలను నిలిపివేసిన అధికారులు భక్తులు ప్రవేశించకుండా ముందు భాగంలోని స్వాగత ద్వారం వద్ద రేకులను అమర్చిన విషయం తెలిసిందే. తాజాగా గేటు బయట నుంచి సైతం మరింత ఎత్తుగా అదనంగా రేకులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో గేటు ముందు రెండంచెల భద్రత తరహాలో ఇనుప రేకులను ఫిక్స్ చేశారు.