News April 10, 2025
అమ్రాబాద్: ప్రమాద ప్రదేశం వరకు కన్వేయర్ బెల్టు పొడిగింపు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రదేశం వరకు గురువారం కన్వేయర్ బెల్ట్‌ను పొడిగించారు. దీంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. సొరంగంలో పనిచేస్తున్న సిబ్బందికి సూచనలు సలహాలు అందిస్తూ సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తున్నారు.
Similar News
News January 3, 2026
KMR: సంక్రాంతికి ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా.. జాగ్రత్త!

సంక్రాంతి పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్లకు రక్షణ కల్పించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఇంటి ముందు వెనుక భాగాల్లో రాత్రిపూట లైట్లు వెలిగేలా ఏర్పాటు చేయండి. బంగారు ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమం అని అన్నారు. మీ వీధిలో అనుమానిత వ్యక్తులు లేదా కొత్తవారు సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేయాలని సూచించారు.
News January 3, 2026
ధనుర్మాసం: పంతొమ్మిదో రోజు కీర్తన

హంస తూలికా తల్పంపై పవళించిన స్వామిని మాట్లాడమని వేడుకుంటున్నారు. కృష్ణుడిని క్షణ కాలం కూడా విడవలేని నీళాదేవిని ఉద్దేశించి ‘తల్లీ! నీ నిరంతర సాన్నిధ్యం నీ స్వభావానికి తగినదే! కానీ, మమ్మల్ని కూడా కరుణించి స్వామి సేవలో పాల్గొనే అవకాశమివ్వు’ అని అడుగుతున్నారు. జగన్మాత అయిన నీళాదేవి అనుమతి వస్తేనే తమ ధనుర్మాస వ్రతం సఫలమై, భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందని గోదాదేవి ఆర్తితో విన్నవిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 3, 2026
జాతీయ కబడ్డీ పోటీలకు గద్వాల క్రీడాకారులు

నేషనల్ జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన అజిత్, మహేష్ ఎంపికయ్యారు. గత నెల పాలమూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో వీరికి స్థానం లభించిందని కబడ్డీ సెక్రటరీ నరసింహ తెలిపారు. ఈ నెల 26 నుంచి విజయవాడలో జరిగే జాతీయ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. వీరి ఎంపిక పట్ల నడిగడ్డ క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


