News April 10, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.
Similar News
News March 24, 2026
మెదక్ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కళాశాల సెమినార్ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 23, 2026
మెదక్: ఏప్రిల్ 15 నుంచి ధాన్యం కొనుగోలు

మెదక్ జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా సన్నాహాలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకం, రవాణా ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలన్నారు.
News March 23, 2026
పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంచాలి: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ శాఖ ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వ్యక్తిగతంగా సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌హెచ్‌ఓలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.


