News April 10, 2025
భారత్‌కు రాణా.. స్పందించిన పాక్

ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా భారత్‌కు తీసుకురావడంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ‘అతడు కెనడియన్ పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి రాణా తన పాక్ డాక్యుమెంట్ల రెన్యూవల్‌కు దరఖాస్తు చేయలేదు. అతడి విషయంలో తగిన సమయంలో మళ్లీ స్పందిస్తాం’ అని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా ముంబై తాజ్ హోటల్‌లో ఉగ్రదాడిలో 166 మంది మరణించారు.
Similar News
News March 13, 2026
LPG సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్

TG: రాష్ట్రంలో LPG సిలిండర్ల రవాణా సురక్షితంగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీసు ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చమురు సంస్థలతో సమన్వయం చేసుకోనున్నాయి. గోదాములు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కృత్రిమ కొరతను అరికట్టి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ చర్యల వెనక ఉద్దేశంగా కనిపిస్తోంది.

IPL: ఆ జట్టులోకి స్టార్ ప్లేయర్

బంగ్లాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను KKR టీమ్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం ముజరబానిని తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల T20 WCలో అతడు అద్భుతంగా రాణించారు. 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్-8కు చేరడంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా 80 T20Iల్లో 90 వికెట్లు పడగొట్టారు. IPL ఆఫర్‌తో ముజరబాని పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నారు.