News April 10, 2025
నేనెప్పటికీ తలా ఫ్యానే: అంబటి రాయుడు

CSK, ఎంఎస్ ధోనీకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘నేనెప్పటికీ తలా అభిమానినే. ఎవరేమనుకున్నా, ఏం చేసినా ఫర్వాలేదు. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఆపేయండి. ఆ డబ్బుల్ని పేదలకు డొనేట్ చేయండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 15, 2025
నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

TG: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభంకానుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. రేపు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20న సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం WWW.TGICET.NIC.INను సందర్శించండి.
News September 15, 2025
ఆందోళనలకు తలొగ్గం: బ్రిటన్ ప్రధాని

వలసలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న <<17705243>>నిరసనల్లో<<>> దాడులు జరగడాన్ని UK PM కీర్ స్టార్మర్ ఖండించారు. ‘జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న వారికి బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది. అధికారులపై దాడులు చేయడంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరు. కలర్, బ్యాగ్రౌండ్ ఆధారంగా ప్రజలను టార్గెట్ చేసుకోవడాన్ని అంగీకరించం’ అని స్పష్టం చేశారు.
News September 15, 2025
24 గంటల్లో 3 మ్యాచులు ఆడిన ప్రొటీస్ క్రికెటర్

దక్షిణాఫ్రికా క్రికెటర్ జోర్న్ ఫార్టూయిన్ ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే మూడు T20 మ్యాచులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. SEP 12న రా.6.30 గంటలకు మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో T20 మ్యాచ్ ఆడారు. 13న మ.2.30 గంటలకు బర్మింగ్‌హామ్‌లో జరిగిన T20 బ్లాస్ట్ సెమీఫైనల్‌లో హ్యాంప్‌షైర్ తరఫున పాల్గొన్నారు. హ్యాంప్‌షైర్ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆ వెంటనే రా.6.45 గంటలకు ఆ మ్యాచ్ కూడా ఆడేశారు.