News April 10, 2025
శ్రీరాంపూర్: కారు నడుపుతుండగా గుండెపోటు.. మృతి

విధి నిర్వహణలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన గురువారం శ్రీరాంపూర్‌లో జరిగింది. ఏరియాలో ఎస్ఆర్పీ 3 గని మేనేజర్ వద్ద కాంట్రాక్టు వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కోటేష్ విధి నిర్వహణలో వాహనం నడుపుతుండగా గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 3, 2026
ప్రభుత్వాలు నడిచేది లిక్కర్ ఆదాయం మీదేనా?

TG: ప్రభుత్వాల ఆదాయానికి మద్యం అమ్మకాలు ఊపిరిగా మారాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.40,209 కోట్ల రికార్డుస్థాయి ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్క ఏడాదిలోనే ఇంత మొత్తంలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. గతేడాది కంటే ఈసారి రూ.2,700 కోట్లకు పైగా అధికంగా విక్రయాలు జరిగాయి. దీన్నిబట్టి లిక్కరే ప్రభుత్వాలకు బంగారు బాతు అని స్పష్టం అవుతోంది.
News April 3, 2026
HYD: ఇద్దరు IAS అధికారులకు పోస్టింగ్‌లు

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్‌ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.