News April 10, 2025
రామగుండంలో భూకంపం?

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో భూకంపం దాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే, రామగుండంలో ఏప్రిల్ 10-17 మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు Epic (Earthquake Research & Analysis) తెలిపింది. తమ పరిశోధన, విశ్లేషణ ప్రకారం రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ట్విట్టర్‌లో పేర్కొంది.
Similar News
News November 8, 2025
నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 8, 2025
HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

డంపింగ్ యార్డ్ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.
News November 8, 2025
గూడూరు: ఒక్కడే కొడుకు.. పుత్ర శోకం మిగిల్చాడు!

గూడూరు మండల కేంద్రానికి చెందిన <<18232373>>షేక్ సోహెల్<<>> శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలంలో పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న యాకూబ్‌కు ఒక్కగానొక్క తనయుడు సోహెల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన తనయుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే తమ మొబైల్ షాప్‌లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొడుకు ఇక రాడని తండ్రి కన్నీటి పర్యంతమైన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.


