News April 10, 2025
రామగుండంలో భూకంపం?

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో భూకంపం దాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే, రామగుండంలో ఏప్రిల్ 10-17 మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు Epic (Earthquake Research & Analysis) తెలిపింది. తమ పరిశోధన, విశ్లేషణ ప్రకారం రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ట్విట్టర్లో పేర్కొంది.
Similar News
News April 19, 2025
కరీంనగర్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

KNR జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.7°C నమోదు కాగా, మానకొండూర్ 42.6, గన్నేరువరం 42.3, గంగాధర 42.1, రామడుగు 41.5, కరీంనగర్ 41.4, చిగురుమామిడి, చొప్పదండి 41.2, తిమ్మాపూర్ 41.1, సైదాపూర్ 40.9, శంకరపట్నం, కరీంనగర్ రూరల్ 40.7, వీణవంక 40.6, హుజూరాబాద్ 40.3, కొత్తపల్లి 39.9, ఇల్లందకుంట 39.9°C గా నమోదైంది.
News April 19, 2025
కరీంనగర్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.
News April 18, 2025
ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 15 మండలాల్లో ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ ప్రక్రియ 100% పూర్తిచేయాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. ఇప్పటీవరకు 2027 మందికి ఇండ్లు మంజూరు కాగా, 730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయిందని, 114 ఇండ్లు బేస్మెంట్ దశలో ఉన్నాయన్నారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.