News April 10, 2025
హత్నూర: 10 కంప్యూటర్లు అందించిన కలెక్టర్

హత్నూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలకు 10 కంప్యూటర్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జేఈఈ, నీట్ కోచింగ్ కోసం ఈ కంప్యూటర్లను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్, వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఫిజికల్ డైరెక్టర్ గణపతి పాల్గొన్నారు.
Similar News
News March 24, 2026
నిర్మల్ : ‘వేసవిలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి’

వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని వివరించారు. వడదెబ్బన బారినపడిన ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలలోనే మెరుగైన చికిత్స అందించాలన్నారు.
News March 24, 2026
సిద్దిపేట: ‘క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యత’

క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యత అని సిద్దిపేట DMHO డాక్టర్ ధనరాజ్ అన్నారు. నాసర్ పుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిగా పాల్గొన్నారు. టీబి ముక్త్ భారత్ అభియాన్ సెకండ్ ఫేస్ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 96 సమస్య ఆత్మక గ్రామాలుగా గుర్తించినట్లు చెప్పారు.
News March 24, 2026
అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: CBN

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై నిగ్గు తేల్చాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా, లేక వాటి వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలి. వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర ఉందనే అనుమానం వస్తోంది’ అని పేర్కొన్నారు. రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.


