News April 10, 2025

సిద్దిపేట: పోషకాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలు: సీడీపీఓ

image

పోషకాహార లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని సీడీపీఓ శారదా అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీం పూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆమె మాట్లాడారు. విద్యార్థులు మంచి పోషకాహారం ఉన్న చిరు ధాన్యాలు తినడానికి ప్రయత్నం చేయాలన్నారు.

Similar News

News March 11, 2026

గ్యాస్ కొరత.. కాంగ్రెస్ Vs బీజేపీ

image

గ్యాస్ కొరతపై కాంగ్రెస్, BJP మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. ATMల ముందు(నోట్ల రద్దు), ఆక్సిజన్(కరోనా) కోసం, ఇప్పుడు గ్యాస్ కోసం జనం క్యూలో ఉన్నారని ఫొటోను INC షేర్ చేసింది. దీంతో ప్రపంచ సంక్షోభాన్ని మోదీకి ముడిపెట్టినా కాంగ్రెస్‌కు ఎవరూ ఓటేయరని BJP సపోర్టర్లు కౌంటరిస్తున్నారు. మోదీ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. 8PM తర్వాత పెట్రోల్ పంపులు మూసేయాలని కాంగ్రెస్ గతంలో చెప్పిందని గుర్తుచేస్తున్నారు.

News March 11, 2026

ప.గో: అధిక ఆదాయంపై దృష్టి కేంద్రీకరించని అధికారులు

image

నరసాపురం <<19354659>>పంటు<<>> వేలంలో ఆసక్తి ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తే ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సొంత పంటు ఉన్నవారే వేలంలో పాల్గొనాలనే నిబంధనతో పోటీ తగ్గుతోందని, నీటిపారుదల, మండల పరిషత్ అధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు. నిబంధనలు సడలించి పారదర్శకత పెంచడం ద్వారా ఖజానాకు భారీగా నిధులు సమకూరుతాయని, ఈ దిశగా యంత్రాంగం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News March 11, 2026

ప.గో: గతం కంటే తక్కువకు కట్టబెట్టే ప్రయత్నాలు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో నరసాపురం – సఖినేటిపల్లి మధ్య ప్రయాణికులను చేరవేసే పంటు వేలం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల ఆదాయం సమకూరింది. తాజాగా సొంత పంటు ఉన్నవారు మాత్రమే పాటలో పాల్గొనాలనే నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల పోటీ తగ్గి, ప్రస్తుత వేలం బిడ్‌ రూ.3.59 లక్షలుగా ఖరారైంది. తాజా పరిణామాలతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.