News March 27, 2024
విశాఖ: ‘ప్రతి ఒక్కరి తలపై రూ.లక్షల్లో అప్పు’

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై లక్షల్లో అప్పు ఉందని ప్రజాశాంతి పార్టీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. మంగళవారం విశాఖ రైల్వే న్యూ కాలనీ వద్దగల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… తాను ఎంపీగా పోటీ చేద్దామని బీజేపీలో చేరితే మోసం చేశారని అన్నారు. అందుకే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎంపీగా కేఏ పాల్‌ను గెలిపించాలన్నారు.
Similar News
News March 11, 2026
విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.
News March 11, 2026
విశాఖలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం..

విశాఖలోని భవన నిర్మాణ అనుమతులు, BPS, లేఅవుట్ల క్రమబద్ధీకరణలో అవినీతి ఆరోపణలపై ACB దర్యాప్తు ముమ్మరం చేసింది. మధురవాడ, పెందుర్తి, గాజువాక జోన్ల పరిధిలో ఫిర్యాదులు అందడంతో మంగళవారం సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. గడువు తర్వాత నిర్మించిన భవనాలు, నిర్మాణంలో ఉన్న వాటికి క్రమబద్ధీకరణ దరఖాస్తులు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.
News March 11, 2026
పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.


