News April 10, 2025
జూలకల్లులో వైసీపీ నేతపై దాడి

ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని జూలకల్లులో వైసీపీ నేత పాశం చిన్న అంజిరెడ్డిపై గురువారం కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆయన్ని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 2, 2026
గుంటూరులో మండిపోనున్న ఎండలు

పసిఫిక్ మహాసముద్రంలో మే నెలలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనివల్ల 2026 వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కోస్తా ఆంధ్రాలోని గుంటూరులో సాధారణం కంటే ఎండలు దంచికొట్టనున్నాయి. వేడి వాతావరణం మరింత పెరగనుంది. ఈ ఎల్‌నినో ప్రభావం ప్రారంభ రుతుపవనాలపై పడనుంది. అయితే అడపాదడపా ప్రీ-మాన్సూన్ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 2, 2026
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలా కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న రూ.7,059 కోట్ల బిల్లులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులు జరిగేలా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.
News April 2, 2026
ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ ఆక్టోపస్‌కి కేటాయింపు

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరిధిలోని ఉండవల్లి ఫైరింగ్ రేంజ్‌ను OCTOPUS విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజ్ గత ఐదు దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు ఇక్కడ శిక్షణ పొందుతుండగా, ఇప్పటివరకు తాడేపల్లి వడ్డేశ్వరం వద్ద ప్రైవేట్ భవనంలో OCTOPUS విభాగం ఉంది.


