News April 10, 2025

 నంద్యాల: మెగా జాబ్ మేళా ప్రారంభం

image

నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. గురువారం నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ , బొమ్మల సత్రంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలను ప్రారంభించారు. 14 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని, దాదాపు 589 కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు.

Similar News

News March 20, 2026

ఏర్పేడు: అప్రెంటిస్ పోస్టులకు ఇంటర్వ్యూలు

image

IIT తిరుపతిలో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) ద్వారా గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. డిగ్రీ-16, డిప్లొమా-14 మొత్తం 40 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. 27, 28, 29 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయని, వివరాలకు https://www.iittp.ac.in/Interns_and_Apprentice వెబ్ సైట్ చూడాలని అధికారులు కోరారు.

News March 20, 2026

మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

image

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

News March 20, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.