News April 10, 2025

సంగారెడ్డి: పిడుగుపాటుకు విద్యార్థి మృతి

image

పిడుగుపాటుకు కళాశాల విద్యార్థి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జరిగింది. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సంతోశ్ కళాశాలకు వెళ్లొస్తుండగా భారీ వర్షం పడటంతో చెట్టుకిందకి వెళ్లాడు. దీంతో చెట్టుపై పిడుగు పడటంతో సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 12, 2026

కేంద్ర మంత్రి గడ్కరీతో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

image

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భీంపూర్, అర్లి కరంజీ మీదుగా మహూర్ వరకు NH-44 (బోరాజ్)ను అప్‌గ్రేడ్ చేయడం, భీంపూర్-కరంజీ రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మావాలా నుంచి చందా వరకు ఉన్న పాత NH-7 విస్తరణ అభివృద్ధి, ఉపస్నాల వరకు NH-44ను నాలుగు లైన్లుగా మార్చడం గురించి చర్చించారు. చర్యలకు మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.

News March 12, 2026

సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.

News March 12, 2026

కడపలో రైతులకు రైతులే మార్గదర్శకులు: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ రంగంలో వినూత్నంగా అమలు చేస్తున్న “ఛాంపియన్ రైతుల ఎంపిక విధానం” గురించి కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 361 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రతి గ్రామంలో ఎక్కువగా పండించే పంటలో నైపుణ్యం కలిగిన 361 మంది రైతులను ఆదర్శ రైతులుగా (ఛాంపియన్లు) గుర్తించినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగు విధానలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.