News April 10, 2025
పవన్ కళ్యాణ్‌పై కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: జగిత్యాల జనసేన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను జనసేన జగిత్యాల ఇంచార్జి బెక్కం జనార్దన్ తీవ్రంగా ఖండించారు. లిక్కర్ కేసులో జైలు పాలైన కవిత మాట్లాడటం హాస్యాస్పదమని, పవన్ ప్రజా బలంతో డిప్యూటీ సీఎం పదవికి ఎదిగారని తెలిపారు. కవిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 13, 2025
కరీంనగర్: కానరాని బొడ్డెమ్మ పండుగ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుక కనుమరుగయిపోయింది. కాగా, భాద్రపద బహుళ పంచమి నుంచి ఈ బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. గ్రామాల్లో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డెమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న బొడ్డెమ్మ వేడుకలు గ్రామాల్లో మాత్రం కనిపించడం లేదు.
News September 13, 2025
4 రోజుల్లో 27,650 టన్నుల యూరియా: తుమ్మల

రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుందని ఆయన శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే శుక్రవారం 11,930 టన్నులు, ఇప్పటి వరకు మొత్తం 23,000 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
News September 13, 2025
కృష్ణా: రూ.10 కోట్ల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

పేద విద్యార్థులు SSC, ఇంటర్ పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్ స్కూలింగ్ విధానం అక్రమార్కులకు కాసులు పండించింది. గత మూడేళ్లుగా ఉమ్మడి కృష్ణాలోని కొందరు అధికారులతో కలిసి ఓ గ్యాంగ్ ఈ దందా కొనసాగిస్తూ రూ.10 కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి లోకేశ్, ఉన్నతాధికారులకు తాజాగా ఫిర్యాదు వెళ్లగా.. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.