News April 10, 2025
లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.
News April 19, 2025
సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News April 19, 2025
ప్రకాశం: వీరిద్దరే దొంగలు.. జాగ్రత్త

ఇటీవల ప్రకాశం జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాళ్లూరు పోలీసులు శుక్రవారం ఇద్దరు దొంగల ఫోటోలను రిలీజ్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా వీళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అనాథాశ్రమానికి సహాయం చేయండంటూ ముందుగా మహిళ తాళాలు వేసిన ఇళ్లను గమనిస్తుంది. ఆ తర్వాత మరో వ్యక్తికి సమాచారం అందిస్తే అతను దొంగతనం చేస్తాడు. వీరితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.