News April 10, 2025

తూ.గో: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై డీఆర్ఓ సమావేశం

image

ఓటర్ల జాబితాల నాణ్యత, స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియజేశారు. గురువారం డీఆర్‌ఓ ఛాంబర్‌లో అసెంబ్లీ నియోజక వర్గాల ఈఆర్ఓలు తదితర సిబ్బందితో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడారు.

Similar News

News April 18, 2026

నిడదవోలులో ఈనెల 18న సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను సందర్శించి భద్రతా పరమైన సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు.

News April 17, 2026

సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

image

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.