News April 11, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
> పాలకుర్తి తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర చారి
> పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని పాలకుర్తిలో ధర్నా నిర్వహించిన సీపీఎం నేతలు
> లింగాల గణపురం: పిడుగుపాటుకు వ్యక్తి మృతి
> గాలివాన బీభత్సం జిల్లాలో పలుచోట్ల రోడ్లపై విరిగిపడ్డ చెట్లు
> జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయినట్లు సృష్టించి అక్రమంగా భూమి పట్టా

Similar News

News January 2, 2026

ఈ మార్పులతో 2026ని హెల్తీగా మార్చుకోండి!

image

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ ఏడాది హెల్తీగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ‘ప్రతిరోజూ వ్యాయామం, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ 7-8 గంటలు నిద్రపోవాలి. జంక్ ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌‌తో ఒత్తిడి తగ్గించుకోండి. కండరాల బలాన్ని పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చు’ అని వైద్యులు చెబుతున్నారు.

News January 2, 2026

PDPL: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జనవరి 21, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, 6-9 తరగతుల ఖాళీలకు FEB 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. వివరాలకు https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

News January 2, 2026

కవిత BRSలో ఉన్నారా.. ఏమి?: కోమటిరెడ్డి

image

TG: KCR శాసనసభకు వస్తే BRS పుంజుకుంటుందని కవిత పేర్కొనడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఆమె BRSలో ఉన్నారా? అనే అనుమానం వస్తోంది. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్నందుకు రక్తం మరిగిపోతోందని ఆమె అంటున్నారు. అంటే కేటీఆర్, హరీశ్‌లను ఉరివేసినా ఫర్వాలేదా? కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు’ అని విమర్శించారు. తన తమ్ముడితో తనకు విభేదాలు లేవని పేర్కొన్నారు.