News April 11, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం ✔రేపు పూలే జయంతి వేడుకలు ✔KCR సభకు.. పార్టీ శ్రేణులకు పిలుపు:BRS ✔జిల్లాల్లో జోరుగా వరి కోతలు ✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు ✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం ✔VKB: కలెక్టరేట్‌లో షార్ట్ సర్క్యూట్ ✔తహశీల్దార్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కిషన్ నాయక్ ✔VKB: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

Similar News

News July 6, 2025

పెద్దమందడిలో 12.8 మి.మీ వర్షపాతం

image

జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు) పెద్దమందడిలో అత్యధికంగా 12.8 మి.మీ వర్షం కురిసింది. అమరచింత 10.2 మదనాపూర్ 6.2 ఘనపూర్ 1.4 గోపాల్పేట్ 1.6 రేవల్లి 7.6 పానగల్ 4.4 వనపర్తి 1.2 కొత్తకోట 2.6 ఆత్మకూరు 1.6 శ్రీరంగాపూర్ 3.0 వీపనగండ్ల 2.8 చిన్నంబావి లలో 1.8 మి.మీ వర్షపాతం, పెబ్బేర్‌లో ‘0’మి.మీ వర్షపాతం నమోదయినట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు.

News July 6, 2025

జగిత్యాల: ముఖ్యమంత్రికి లేఖ రాసిన మాజీ మంత్రి

image

రాష్ట్ర మత్స్యకారులకు చేపల విత్తనం పంపిణీకి బదులుగా.. వాటి విలువ నగదు రూపేనా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో చేపల విత్తనాలను స్వయంగా సమకూర్చుకునే వసతి లేనందున పక్క రాష్ట్రం ద్వారా ఎగుమతి చేయడంతో సమయం వృథా అవుతుందని, మత్స్యకారులు నష్టపోతున్నారని తెలిపారు. చేపల పెంపకంలో ఎంతో అనుభవం కలిగిన మత్స్యకారులకు నేరుగా నగదు చెల్లించాలని కోరారు.

News July 6, 2025

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం?

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. కానీ నిన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్‌ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.