News April 11, 2025
కాకినాడ జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి కాకినాడ నగరంలో వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి.
Similar News
News March 14, 2026
అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు.. మార్గదర్శకాలివే

AP: అంగన్‌వాడీ హెల్పర్లను వర్కర్లుగా పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల్లో 50% అర్హులైన హెల్పర్లతో భర్తీ చేయాలి. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్‌నెస్ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50yrs దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి.
News March 14, 2026
దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలి: వికారాబాద్ ఎస్పీ

కేసుల దర్యాప్తును ఆధునిక పద్ధతులతో వేగవంతం చేయాలని వికారాబాద్ SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం SP కార్యాలయంలో కానిస్టేబుళ్లు, రైటర్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీని వాడి దర్యాప్తు నాణ్యత పెంచాలని ఆదేశించారు.
News March 14, 2026
నంద్యాల జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే!

నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు ఉదయం 7.45 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.


