News April 11, 2025

పార్వతీపురం జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. పర్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం జిల్లాలో వాతావరణ మారింది. పాచిపెంట, భామిని, సాల్లూరుతో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

Similar News

News November 1, 2025

శ్రేయస్ అయ్యర్ డిశ్ఛార్జ్

image

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడిన టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని BCCI వెల్లడించింది. శ్రేయస్ రికవర్ కావడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ఫాలోఅప్ కోసం కొన్ని రోజులు ఆయన సిడ్నీలోనే ఉంటారని వివరించింది. సిడ్నీ, ఇండియా డాక్టర్లకు థాంక్స్ చెప్పింది. శ్రేయస్‌కు ఇటీవల <<18131470>>సిడ్నీ వైద్యులు<<>> మైనర్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే.

News November 1, 2025

విశాఖలో DRO నియామకం ఎప్పుడో?

image

విశాఖలో DRO, RDO మధ్య జరిగిన వివాదంతో ఇద్దరినీ బదిలీ చేశారు. DRO భవానీ శంకర్ స్థానంలో JCకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే మరో 2 వారాల్లో నగరంలో CII భాగస్వామ్య సదస్సుతో పాటు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. సాధారణంగా ప్రోటోకాల్ వ్యవహారాలు, ముఖ్య అధికారుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం వంటి పనులన్నీ DRO పరిధిలో ఉంటాయి. ఈ సమయంలో DRO స్థానం ఖాళీగా ఉండడంతో వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

News November 1, 2025

HZB: ‘భవనాలు కాదు.. భద్రత, భరోసా కావాలి’

image

ప్రభుత్వం కేవలం భవనాలు నిర్మించడం కాకుండా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు భద్రత, భరోసా కల్పించాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. వంగర గురుకుల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ హుజూరాబాద్ రాంపూర్‌కు చెందిన విద్యార్థిని శ్రీ వర్షిత కుటుంబాన్ని ఆయన శుక్రవారం రాత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి వారికి భరోసా కల్పించారు.