News April 11, 2025

అన్నమయ్య: ప్రవేశ పరీక్ష తేదీ మార్పు

image

మోడల్ స్కూల్‌‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న జరగాల్సిన ఎంట్రన్స్ ఎగ్జాం 21కి వాయిదా పడినట్లు చిన్నమండెం ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. 20న ఈస్టర్ పండుగ ఉండడంతో పరీక్షను మరుసటి రోజుకు మార్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపారు. పిల్లలు, తల్లితండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. www.cse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.

Similar News

News March 27, 2026

MHBD: శ్రీరామనవమి సాక్షిగా.. ప్రేమికుల విగ్రహాలకు కళ్యాణం

image

MHBD జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో 22 ఏళ్ల క్రితం చనిపోయిన తన కొడుకు కోటి, అతని ప్రేయసి ప్రేమను గెలిపించాలని కోటి తల్లి ఆరాటపడుతోంది. ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో కోటి, ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ప్రేమ గుర్తుగా ప్రతి శ్రీరామనవమి రోజున కోటి తల్లిదండ్రులు వారి విగ్రహాలకు శాస్త్రోక్తంగా వివాహం చేస్తున్నారు. తమ కొడుకు ప్రేమను లోకం గుర్తించాలని తపన పడుతున్నారు.

News March 27, 2026

విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ప్రమాదం.. దంపతుల దుర్మరణం

image

విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మంగళగిరి (M) చినకాకాని వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న మంగళగిరికి చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

News March 27, 2026

లగ్జరీ ఫ్లాట్ కొన్న గిల్.. బిల్డర్ హీరోయిన్ భర్తే!

image

దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహూలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.20.7 కోట్లు పెట్టి ఓ అపార్ట్‌మెంట్ 12వ ఫ్లోర్‌లో 3,369 చ.అ. ఫ్లాట్ కొన్నారు. స్టాంప్ డ్యూటీకే 1.24Cr చెల్లించారు. ఇక ఈ అపార్ట్‌మెంట్‌ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి రకుల్‌ప్రీత్ భర్త జాకీ భగ్నానీ, ఆయన పేరెంట్స్ నిర్మిస్తుండటం గమనార్హం. దీని నిర్మాణం 2029లో పూర్తి కానుంది.