News April 11, 2025
MNCL: సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు: కలెక్టర్

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సన్నబియ్యం విక్రయించడం, కొనుగోలు చేయవద్దని, విక్రయిస్తే రేషన్ కార్డు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్లు అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 4, 2025
MHBD: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 3 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ రాజు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం బతికి ఉన్న రాజును వైద్య సిబ్బంది మార్చురీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే రాజు మృతి చెందాడని ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 4, 2025
పెద్దపల్లి యార్డులో పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.6,844

పెద్దపల్లి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి కొనుగోలు సజావుగా సాగింది. పత్తి క్వింటాలుకు కనిష్ట ధర రూ.5,701, గరిష్టం రూ.6,844, సగటు ధర రూ.6,621గా నమోదైంది. మొత్తం 477 మంది రైతులు 1,393.2 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. మార్కెట్ యార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాపారం ప్రశాంతంగా సాగిందని వ్యవసాయ మార్కెట్ ఇంచార్జ్ మనోహర్ తెలిపారు.
News November 4, 2025
జగన్ పర్యటనకు వింత షరతులు: వైసీపీ ఫైర్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గాను జగన్ నేడు జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం రానున్నారు. అయితే జగన్ పర్యటనలో 500 మంది, 10 కాన్వాయ్‌లకే పోలీసులు అనుమతి ఇచ్చారు. బైక్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై YCP ట్వీట్ చేసింది. జగన్ పర్యటనకు వేలాది మంది వస్తారని తెలిసినా ఈ వింత షరతులు ఏంటని మండిపడింది.


