News April 11, 2025

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి: ADB SP

image

ట్రాఫిక్ సిబ్బందితో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలతో ఎత్తకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విధులు నిర్వర్తించే క్రమంలో బాడీ ఆన్ కెమెరాలను ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత ఎండాకాలం దృష్ట్యా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Similar News

News March 13, 2026

పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ADB SP

image

జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేయడంతో పాటు 200 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 13, 2026

ADB: స్కాలర్ షిప్స్ నేరుగా అకౌంట్‌లో జమ

image

జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను చెల్లించాల్సిన బోధన రుసుములు (ట్యూషన్ ఫీజులు) ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి తెలిపారు. మంజూరైన డబ్బుల్లో విద్యార్థుల నిర్వహణకు కొంత డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ట్యూషన్ ఫీజు కింద కళాశాలలకు చెల్లించాలని సూచించారు.

News March 13, 2026

ADB: గ్యాస్ బుకింగ్ హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

image

గ్యాస్ రీఫిల్లింగ్ గడువును 15 రోజుల నుంచి 20 రోజులకు పెంచామని.. దీంతో ఎలాంటి కొరత ఉండబోదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జిల్లాలో సిలిండర్ల స్టాక్ తగినంతగా అందుబాటులో ఉందని వివరించారు. ప్రజలు అనవసరంగా భయాందోళనతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. బుకింగ్ లేదా సరఫరలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదుకై టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939ను సంప్రదించాలని సూచించారు.