News April 11, 2025

కూలీలకు 100రోజుల పని కల్పించాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కాగజ్‌నగర్ మండలం కోయవాగులో ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న అభివృద్ధి ఫారం పాండ్ పనులను పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కొనసాగుతున్న పనులలో ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించాలని తెలిపారు.

Similar News

News March 2, 2026

అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్

image

అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. చర్చల పునరుద్ధరణకు తమ నుంచి ప్రతిపాదనలు వచ్చాయంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇజ్రాయెల్ ఆధిపత్య లక్ష్యాల కోసం ట్రంప్ తమ సైనికులను పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యాధిపతి భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

News March 2, 2026

పుష్పగిరి నీళ్లలో యువకుని మృతదేహం లభ్యం

image

పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నీళ్లలో ఈత కోసం దిగి గల్లంతైన చైతన్య మృతదేహం లభ్యమైంది. రిస్క్ టీం సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుని జాడ కనిపించలేదు.

News March 2, 2026

ప్రొద్దుటూరు హాస్టళ్లో విద్యార్థి సూసైడ్.. డీఈవో ఆరా.!

image

పొద్దుటూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి తలారి నరసింహులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఈవో శంషుద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ బ్రహ్మయ్యను విచారించారు. ఘటనకు గల కారణాలను అడిగారు. మార్చురీకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. MEOలు శోభా, సావిత్రి, AMO విజయభాస్కర్ ఉన్నారు.