News April 11, 2025

WNP:ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% తగ్గింపు

image

వనపర్తి : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% తగ్గింపుతో ప్రభుత్వం కల్పించిన రిబేట్ అవకాశం ప్రయోజనాల గురించి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Similar News

News March 26, 2026

హోప్ ఐలాండ్‌లో ఆలివ్ రిడ్లే సందడి.. సముద్రంలోకి 585 తాబేళ్లు

image

అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల పరిరక్షణలో భాగంగా హోప్ ఐలాండ్ తీరంలో గురువారం 585 తాబేలు పిల్లలను అధికారులు సురక్షితంగా సముద్రంలోకి వదిలారు. JC అపూర్వ భరత్, DFO రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా కార్యక్రమంలో పాల్గొని తాబేళ్ల సందడిని తిలకించారు. తాబేళ్ల గుడ్ల సంరక్షణకు తీరంలో 174 రక్షణ వలయాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 19,858 గుడ్లను పరిరక్షించామని వారు వెల్లడించారు.

News March 26, 2026

విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం.. యువకుల అరెస్ట్

image

విజయవాడకు చెందిన ఇద్దరు యువకులను పెనమలూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన యువకులు అనంత కుమార్, మహేష్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు దాడి చేశారు. వారి నుంచి 5 కేజీల గంజాయి, 1 గ్రామ్ కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పెనమలూరు సీఐ వెల్లడించారు. కాగా గ్యాంగ్ వార్ కేసులో అనంత్ కుమార్ నిందితుడిగా ఉన్నాడన్నారు.

News March 26, 2026

కేయూ సైన్స్ ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

image

కాకతీయ యూనివర్సిటీ 2026-2027 విద్యా సంవత్సరానికి గాను సైన్స్ ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జీవాలజీ 13, మ్యాథమెటిక్స్ 09, మైక్రోబయోలజీ 06, ఫిజిక్స్ 06, కంప్యూటర్ సైన్స్ 05,
బయోటెక్నాలజీ 04,
బాటనీ 04, కెమిస్ట్రీ 04,
బయోకెమిస్ట్రీ 03, జియాలజీ 01 ఉన్నాయి. ఏప్రిల్ 10 చివరి తేదీ.
వివరాల కోసం అభ్యర్థులు www.kakatiya.ac.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.