News April 11, 2025

GWL: ‘ఉపాధి హామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలి’

image

జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జరుగుతున్న పనులు పారదర్శకంగా ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం ఐడిఓసి మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీకి సంబంధించి పూర్తి వివరాలు, రిజిస్టర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఉపాధి పనులు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూలీలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News March 5, 2026

అప్పుడు తగ్గింది ఇప్పుడు నెగ్గడానికేనా?

image

గతేడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP-JDU కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 సీట్లలో BJP 89, JDU 85 చోట్ల గెలిచాయి. మెజార్టీ స్థానాలు దక్కినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాషాయ పార్టీ నితీశ్‌కే సీఎం పదవి ఇచ్చింది. అయితే BJP అప్పుడు వెనక్కి తగ్గింది ఇప్పుడు సీఎం పదవి చేజిక్కించుకొని, రాష్ట్ర రాజకీయాలను శాసించడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 5, 2026

‘HYD, WGL, VJAలకు విస్తరించడం అభినందనీయం’

image

శివ సాయి యాడ్స్ నిర్వాహకులు చెన్నూరి శ్రీకాంత్‌ను భద్రాద్రి బ్యాంక్ ఛైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి బ్యాంకు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ శివ సాయి యాడ్స్‌ను హైదరాబాద్, వరంగల్, విజయవాడ నగరాలకు విస్తరించడం అభినందనీయమన్నారు. శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు.

News March 5, 2026

నత్తనడకన రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయ డిజిటలైజేషన్ లక్ష్యంగా సాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం 60 శాతం మాత్రమే నమోదైందని, రిజిస్ట్రేషన్ లేకపోతే పీఎం కిసాన్, పంటల బీమా, సబ్సిడీలు అందవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు తమ ఆధార్, పాసుపుస్తకం, మొబైల్ నంబరుతో వెంటనే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. సకాలంలో పూర్తి చేయకుంటే ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సి వస్తుందని తెలిపారు.