News April 11, 2025
సిద్దిపేట: ఈవీఎం గోదాం చుట్టు 24/7 బందోబస్తు: కలెక్టర్

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ పక్కన గట ఈవీఎం గోదాంను కలెక్టర్ మనుచౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాం చుట్టూ తిరిగారు. లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ అధికారుల 24/7 బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News July 5, 2025
వరంగల్: రాష్ట్రంలోనే తొలి గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహం మనదే!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పెద్ద తండాలో రాష్ట్రంలోనే తొలిసారిగా గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటుకు తండాకు చెందిన లూనావత్ భిక్ష్య నాయక్ ఆర్థిక సహాయం అందించగా ఇటీవల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమ తండాల్లో ఇలాంటి గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు గాను పలువురు గిరిజనులు వారిని అభినందిస్తున్నారు. స్థానికులు విగ్రహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
News July 5, 2025
మరో రెండు రోజులు గోదావరి వరద ఉద్ధృతి

గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే తరహాలో ఉంటుందని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. సీలేరుతో కలిపి శనివారం గోదావరి ఇన్‌ఫ్లో 1,70,929 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. 3 డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 12,100 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. మిగిలిన 1,60,218 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News July 5, 2025
మహబూబ్ నగర్: IIIT.. టాప్ విద్యార్థులు వీళ్లే!

మహబూబ్‌నగర్‌లో IIIT క్యాంపస్ నూతనంగా ఏర్పాటు చేశారు. నిన్న విడుదల చేసిన క్యాంపస్ ఎంపిక ఫలితాల్లో హర్షిత(574) సంగారెడ్డి, నిహారిక(572) నారాయణపేట, శ్రీవిద్య(570) నిజామాబాద్, హాజీబేగం(569) సంగారెడ్డి, మొహమ్మద్ గులాం సాధిక్(568) జనగామ టాపర్లుగా నిలిచారు. ఉమ్మడి జిల్లాల్లో
MBNR-20, NGKL-21, GDWL-6, WNPT-4, NRPT-15 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.