News April 11, 2025

ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా ఆదోని నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారం 6,7,8 నూతన ఓటర్ నమోదు, చిరునామా, మొదలగు అంశాలపై ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో చర్చించారు.  ఎన్నికల ఉప తహశీల్దారు గాయత్రి, తదితరులు ఉన్నారు. 

Similar News

News January 1, 2026

కర్నూల్: కలెక్టర్ బంగ్లాలో న్యూ ఇయర్ వేడుకలు

image

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలెక్టర్ బంగ్లాలో రెవెన్యూ, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా 2026లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సలహాలు సూచనలు చేశారు.

News January 1, 2026

కర్నూల్: డీఐజీగా విక్రాంత్ పాటిల్‌కి పదోన్నతి

image

జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రాంత్ పాటిల్ డీఐజీగా పదోన్నతి పొందారు. ఆయన గురువారం జిల్లా జడ్జి కబర్థిని, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారికి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలుపగా.. పదోన్నతి పొందిన విక్రాంత్ పాటిల్‌ను జిల్లా జడ్జి, రేంజ్ డీఐజీలు ప్రత్యేకంగా అభినందించారు.

News January 1, 2026

నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్‌ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.