News April 11, 2025
అనంత: వర్షాల వేళ ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి

ఏపీ విపత్తుల సంస్థ సూచనల మేరకు అనంతపురం జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదని సూచించారు. సురక్షితమైన భవనాల్లో ప్రతి ఒక్కరూ ఆశ్రయం పొందాలి.. వర్షాల వేళ అందరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Similar News
News July 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.