News April 11, 2025

పేదలకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వరం: ఎమ్మెల్యే కడియం

image

ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం వరమన్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

Similar News

News March 13, 2026

మూసీ కాలుష్యం.. రైతుల పాలిట శాపం: సీఎం రేవంత్

image

మూసీ కాలుష్యం వల్ల భువనగిరి నుంచి ఆలేరు వరకు పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కలుషిత నీటితో పండించిన పంటలు విషతుల్యమవుతున్నాయని, ఆ ప్రాంత యువతకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థాలు, పశువుల కళేభరాలతో నది కంపు కొడుతోందని, ఫ్లోరైడ్ బాధితులకు తోడు మానవ తప్పిదాల వల్ల నల్గొండ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు.

News March 13, 2026

మూసీ పునరుద్ధరణను గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా: రేవంత్

image

TG: చరిత్రలో నగరాలన్నీ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అభివ‌ృద్ధి చెందాయని CM రేవంత్ రెడ్డి అన్నారు. మనం కూడా అభివృద్ధిని అందుకోవాలనే మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాంటి ప్రాజెక్టును గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా అని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించారు. BRS, BJP దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని నిలదీశారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో CM ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 13, 2026

MBNR: పదో తరగతి పరీక్షలు.. జిల్లా విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం చేశారు. ​పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఏవైనా సందేహాలున్నా, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్‌ను 83747 72282ను సంప్రదించాలని డీఈవో ప్రవీణ్ కుమార్ సూచించారు.