News April 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 17, 2025

TODAY HEADLINES

image

✦ రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CM CBN
✦ TGకి నాలుగో అద్భుతంగా RFC: CM రేవంత్
✦ రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో CBN, రేవంత్ సరదా ముచ్చట్లు
✦ TGలో రేషన్ కార్డు ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికెట్ జారీ
✦ కూటమి ప్రభుత్వంలో భారీగా పెరిగిన అప్పులు: YS జగన్
✦ ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్
✦ తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం

News November 17, 2025

దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ పెట్రోలింగ్

image

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల US, జపాన్‌లతో కలిసి ఫిలిప్పీన్స్ అక్కడ నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. దీనికి కౌంటర్‌గా చైనా తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్‌ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని డ్రాగన్ వాదిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకే ఫిలిప్పీన్స్ విన్యాసాలు చేపట్టింది.

News November 17, 2025

నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

image

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్‌లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్‌ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్‌ల నుంచి పై ఫొటోను డిజిటల్‌గా క్రాప్ చేశారు. బ్లూ కలర్‌లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్‌లో ఉన్నవి వలయాల నీడలు.