News April 11, 2025
నేడే డయల్ యువర్ డీఎంలో పాల్గొనండి: జనగామ డీఎం

జనగామ ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం ఉ.10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నామని డీఎం స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ సమస్యలతో పాటు సూచనలు సలహాలకు 9959226050 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News April 18, 2026
VJA: తీర్పు నేడే.. మళ్లీ కస్టడీ దొరుకుతుందా?

అక్రమాస్తుల కేసులో అరెస్టైన దేవదాయ శాఖ అధికారిణి శాంతిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రెండు రోజుల పాటు విచారించినా కీలక సమాచారం రాబట్టలేకపోయామని, ఆమె ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరింత విచారణ కోసం 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.
News April 18, 2026
KNR: పీజీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

KNR జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ & పీజీ కళాశాలలో పీజీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రో. డి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 170 మంది విద్యార్థినిలు హాజరు కాగా 158 మంది పాస్ అయినట్లు తెలిపారు. ఓవరాల్‌గా పాస్ పర్సంటేజ్ 92.34 గా ఉందని అన్నారు. Msc botany, chemistryలో 100% పాస్ అయినట్లు తెలిపారు.
News April 18, 2026
పులివెందుల టీడీపీలో వర్గపోరు?

పులివెందుల టీడీపీలో వర్గపోరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అంటీఅంటనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కోవర్టు అని వ్యాఖ్యానించారు. ప్రధాన నేతల మధ్యే సఖ్యత లేకపోతే ఎలా అని కార్యకర్తలు భావిస్తున్నారు.


