News April 11, 2025

వరంగల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, హార్వెస్టింగ్ యజమానులతో అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద దేవి పాల్గొని 2024-2025 రబీ(యాసంగి) సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి ఉన్నారు.

Similar News

News April 19, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ

image

వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహా మండపంలో వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి తీర్ధ ప్రసాదములు అందజేశారు.

News April 19, 2025

వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

image

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.

News April 19, 2025

మన ‘పాకాల’ నీరు.. సముద్రంలో కలుస్తోందిలా!

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.

error: Content is protected !!