News April 11, 2025
జనగామ జిల్లాకు చేరుకున్న ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు

రాబోయే విద్యా సంవత్సరం 2025-26కు గాను జనగామ జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు గురువారం నుంచి చేరుకుంటున్నాయని జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్ తెలిపారు. 2,78,310 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంటాయని, రాష్ట్ర గోదాం నుంచి గురువారం జిల్లా కేంద్రానికి చేరాయని అన్నారు. ఈనెల చివరి వరకు అన్ని చేరుకుంటాయని, అవి రాగానే మండలాల వారీగా పంపుతామని తెలిపారు.
Similar News
News April 16, 2026
ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 5-7, 15-17 ఏళ్ల విద్యార్థుల ఆధార్ నవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. 17,501 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సచివాలయాల్లో శిబిరాలు నిర్వహించి, 24 గంటల్లో సవరణలు చేయాలని అధికారులకు సూచించారు.
News April 16, 2026
నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 12.85 లక్షలు

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.
News April 16, 2026
భద్రాచలం: ఫలితాల్లో ఏకలవ్య విద్యార్థుల ప్రభంజనం

పదో తరగతి సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు (EMRS) 99.78 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించాయి. మొత్తం 455 మంది విద్యార్థులకు గాను 454 మంది పాసయ్యారని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. 8 పాఠశాలల్లో 7 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, బాలికలందరూ ఉత్తీర్ణత పొందడం విశేషం. ప్రతిభ చాటిన 18 మంది విద్యార్థులను పీవో ప్రత్యేకంగా అభినందించారు.


