News April 11, 2025
BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.
Similar News
News March 19, 2026
అదృష్టం తెచ్చిన కూతురు..

‘ధురంధర్’తో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగింది. కొవిడ్ తర్వాత ఆయన తీసిన చిత్రాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. 2022లో జయేశ్‌భాయ్ జోర్దార్, సర్కస్, 2023లో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 2024లో రణ్‌వీర్, దీపికా పదుకొణె దంపతులకు పాప జన్మించింది. 2025లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ‘ధురంధర్’ ప్రాజెక్టు రావడంతో రణ్‌వీర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు.
News March 19, 2026
ఎల్లుండి రంజాన్.. రేపు సెలవు లేదు

AP: రేపు (మార్చి 20) ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ పని దినం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. <<19427809>>రంజాన్<<>> మార్చి 21న జరుపుకోవాలని మతపెద్దలు సూచించడంతో సెలవును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం (మార్చి 21) పబ్లిక్ హాలిడే ఉంటుందని పేర్కొంది. అయితే శనివారం జరగాల్సిన పదోతరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ నిర్వహణపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News March 19, 2026
యుద్ధం ఎఫెక్ట్.. క్రికెట్ బంతుల కొరతపై ఆందోళన!

ప.ఆసియా ఉద్రిక్తతలతో UKలో డ్యూక్ క్రికెట్ బంతుల కొరత ఏర్పడింది. APR 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కానుండగా బంతుల కొరతపై ఆందోళన మొదలైంది. బాల్స్ తయారయ్యే ద.ఆసియా నుంచి రవాణా జరగాల్సి ఉండగా మిడిల్ ఈస్ట్ రూట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రూట్లను చూస్తున్నట్లు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ కంపెనీ ఓనర్ దిలీప్ జజోడియా తెలిపారు. విమానాల్లో తీసుకెళ్లాలంటే ఖర్చు 3 రెట్లు అధికం అవుతుందన్నారు.


