News April 11, 2025

ధన్వాడ: ఫోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

దన్వాడ మండలానికి చెందిన మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసిన ఇదే మండలానికి చెందిన టప్ప భాను అనే నిందితుడికి గురువారం జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ 26 సంవత్సరాల జైలు శిక్ష రూ. 8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చ్ 17న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. సాక్ష్యాధారాలు పరిశీలన అనంతరం కోర్టు తీర్పు వెల్లడించారని చెప్పారు.

Similar News

News March 4, 2026

వరంగల్: డ్రంకెన్ డ్రైవ్‌లో 105 మందిపై కేసులు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 105 మంది పట్టుబడ్డారు. ఇందులో అత్యధికంగా ట్రాఫిక్ విభాగంలోనే 57 కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 16, వెస్ట్ జోన్‌లో 30, ఈస్ట్ జోన్‌లో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News March 4, 2026

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

యుద్ధం మొదలైన రోజు అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,850 పతనమై రూ.1,50,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.20వేలు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.

News March 4, 2026

జనగామలో విషాదం.. అన్నదమ్ముల మృతి

image

జనగామలో మంగళవారం జరిగిన <<19292392>>రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరాఠీ దినేష్ (24), భూణేష్ (21)<<>> వరుసకు అన్నదమ్ములు. వీరు జనగామ జ్యోతి నగర్‌లో వారి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. దినేష్ ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో హోలీ సంబరాలు చేసుకొని, సిద్దిపేట ఫ్లై ఓవర్ మీదుగా వస్తుండగా టాటా ఏస్ వాహనాన్ని ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. టాటా ఏస్ వాహన డ్రైవర్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.