News April 11, 2025

MNCL: 19న అంతరిక్ష విజ్ఞానంపై వెబినార్

image

భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 19న ఆన్‌లైన్‌లో వెబినార్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి, అభిరుచి కల్పించేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో పాల్గొనేందుకు ఈ నెల 17 లోగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్ సైట్‌ సందర్శించాలన్నారు.

Similar News

News July 6, 2025

సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు

image

సంగారెడ్డి జిల్లా ఎంపీడీఓ సుధాకర్, మాల్సుర్ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇతర జిల్లాలో పని చేస్తున్న చంద్రశేఖర్, మంజుల, శారద దేవీ జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీఓలు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

News July 6, 2025

ప్రేమజంట ఆత్మహత్య!

image

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

నేడు మంగళంపల్లి జయంతి

image

నేడు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి. రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తంలో 1930 జులై 6న జన్మించిన బాలమురళీకృష్ణ, తన అసాధారణ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గాయకుడిగా, స్వరకర్తగా, వాగ్గేయకారుడిగా ఆయన సంగీత లోకానికి అందించిన సేవలు అనన్యసామాన్యం. ఆయన పాడిన పాటల్లో ఈ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.