News April 11, 2025

KMR: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్‌కి చెందిన గైక్వాడ్ బాలాజీ.. బాలిక రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.

Similar News

News March 19, 2026

ప్రకాశం: శ్రీచైతన్య స్కూల్ గుర్తింపు రద్దు

image

ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీచైతన్య స్కూల్లో 6వ తరగతి విద్యార్థి తౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. విచారణ నిమిత్తం కలెక్టర్ రాజాబాబు త్రిసభ్య కమిటీ నియమించారు. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి వివరణ ఇవ్వాలని స్కూల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాళ్లు రిప్లే ఇవ్వకపోవడంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కూల్ అనుమతి రద్దు చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక వెల్లడించారు.

News March 19, 2026

61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

image

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రకటించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జిల్లా కమిటీని విస్తరించారు. జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మొత్తం 61 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీని విస్తరించినట్లు తెలిపారు.

News March 19, 2026

మరోసారి భారీగా పడిపోయిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19423062>>బంగారం ధరలు<<>> మరోసారి భారీగా పడిపోయాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ఏకంగా రూ.7,140 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రా. గోల్డ్ రేటు రూ.1,50,280 పలుకుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.6,550 తగ్గి రూ.1,37,750కి చేరింది. ఇవాళ కేజీ వెండి రేటు రూ.10,000 తగ్గి రూ.2.65 లక్షలు పలుకుతోంది.