News April 11, 2025
సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

పిడుగుపాటుకు కొండాపూర్‌లో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగారానికి చెందిన సంతోష్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో సదాశివపేట మండల పరిధిలోని ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 5, 2025
వంకేశ్వరం మీదుగా SLBC ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సందర్శన, ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం చేపట్టిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పనులు వేగం అయినట్లు తెలుస్తోంది. మిగిలిన 9.2 కమ్ టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే ప్రపంచంలో 42 కి.మీ.భారీ టన్నెల్‌గా ప్రపంచంలో చోటు దక్కనుంది. బుధవారం వంకేశ్వరం ప్రాజెక్ సమీపం సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది. స్థానికులు వీడియోలు తీశారు.
News November 5, 2025
ఏలూరులో డెడ్ బాడీ కలకలం

ఏలూరు నగరంలోని ఓ మురుగు కాలువలో బుధవారం మృతదేహం కలకలం రేపింది. ఒకటో పట్టణ పరిధిలోని పాండురంగ థియేటర్ సమీపంలో డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. మృతదేహం నీటిపై తేలి ఆడుతూ ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకటో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 5, 2025
ఈ 4 కారకాలతోనే గుండె జబ్బులు: వైద్యులు

ఇటీవల గుండెపోటు మరణాలు పెరగడంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉండేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ‘99శాతం గుండె జబ్బులు అకస్మాత్తుగా రావు. మొదటిసారి ఈ సమస్యలు ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించాం. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్, పొగతాగడం వంటివే ఆ కారకాలు. వీటిని నియంత్రించగలిగితే మీరు బయటపడినట్లే. తరచూ చెక్ చేసుకోండి’ అని వైద్యులు చెబుతున్నారు.


