News April 11, 2025

VKB: ’15 నుంచి ప్రారంభించాలి’

image

ఈనెల 15 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోలపై ఐకెపీ, సీఎంఎస్ మెప్మా డీసీఎంఎస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 12, 2026

ఈరోజు నమాజ్ వేళలు (12-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 12, 2026

నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

News March 12, 2026

తిరుపతి: టెండర్ల నిబంధనలపై కమిషన్ విచారణ

image

కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ దినేశ్ కుమార్ బుధవారం టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగంతో చర్చించారు. జీఎం ఉమాశంకర్ సహా మరికొందరి ఉద్యోగులతో గతంలో టెండర్ల నిబంధనలు.. ప్రస్తుత ధరలు, నిబంధనలు మార్పు చేయాలంటే ఏలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా మరికొన్ని విభాగాల ఆధికారులతో సైతం చర్చించే అవకాశం ఉంది.