News March 27, 2024
కర్నూలు: 3 నుంచి ఏప్రిల్ నెల పింఛన్లు

ఏప్రిల్ నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3 రోజులు ఆలస్యం కానుందని డీఆర్డీఏ-వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ సలీమ్ బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 31 ఆదివారం నాటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, మరుసటి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉందని, 2న పింఛన్ల బడ్జెట్‌ను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుందని చెప్పారు. 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పెన్షనర్లు గమనించాలని కోరారు.
Similar News
News March 18, 2025
పోసాని మోసం చేశాడంటూ కర్నూలు వ్యక్తి ఫిర్యాదు

నటుడు పోసాని కృష్ణ మురళిని కేసులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి పోసాని తనను మోసం చేశాడంటూ తాజాగా టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని రూ.9లక్షలు తీసుకుని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. తననకు న్యాయం చేయాలని కోరారు.
News March 18, 2025
కర్నూలు జిల్లాలో తొలిరోజు ఇద్దరు డిబార్.. టీచర్ సస్పెండ్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు 700 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కర్నూలు సీఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను ఆర్జేడీ శామ్యూల్ డిబార్ చేశారు. జొన్నగిరి కేంద్రం వద్ద తెలుగు టీచర్ కేశన్న కనింపించడంతో ఆయనను ఆర్జేడీ సస్పెండ్ చేశారు.
News March 18, 2025
దేవనకొండలోకి నో ఎంట్రీ: CI వంశీనాథ్

గద్దెరాళ్ల దేవర రేపటి నుంచి జరగనుంది. ఈక్రమంలో దేవనకొండ సీఐ వంశీనాథ్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గద్దెరాళ్ల రోడ్డులోనే వాహనాలు రావాలని చెప్పారు. దేవనకొండ గ్రామంలోకి వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దేవరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలు, 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.