News April 11, 2025
SRD: రేపే స్క్రీనింగ్ టెస్ట్.. వెబ్ సైట్‌లో హాల్ టికెట్లు

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఇవ్వనున్న బ్యాంకింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ టీ.ప్రవీణ్ తెలిపారు. ఈనెల12 శనివారం రోజు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు.
Similar News
News March 14, 2026
గ్యాస్ సరఫరాపై నిరంతర నిఘా: కలెక్టర్

సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాను మానిటరింగ్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 14, 2026
US అప్పుడు ఇండియాను బెదిరించి ఇప్పుడు వేడుకుంటోంది: ఇరాన్

రష్యా నుంచి చమురు కొనవద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించిందని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరఘ్చి ట్వీట్ చేశారు. ఇరాన్‌తో 2 వారాల యుద్ధం తర్వాత ఆ పరిస్థితి మారిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని INDతో సహా మిగతా దేశాలను US వేడుకుంటోందని విమర్శించారు. ఇరాన్‌పై వార్‌కు మద్దతిస్తే రష్యాకు వ్యతిరేకంగా US సపోర్ట్ తమకు లభిస్తుందనుకున్న యూరప్‌కు ఎదురుదెబ్బ తగిలిందన్నారు.
News March 14, 2026
గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అదనపు కలెక్టర్ నగేష్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన 2-3 రోజుల్లోనే డెలివరీ చేసేలా చూడాలని ఆదేశించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.


